Saturday, 14 March 2020


కోమటిపల్లి గ్రామపరిధిలో నూతనవిధానాలు పాటించి,మంచి ఫలితాల్ని సాధించి యువరైతులు ఆదర్శంగా నిలవడంతో గ్రామవ్యవసాయ,పశుపోషణరంగాల్లో గణనీయమైన పురోగతి కలిగింది.
ఈ సందర్భం లో విత్తనఉత్పత్తి లో మంచి సలహా పాటించి సొంతంగా విత్తనాలు తయారు చేసుకోండి
@మన స్థానికవిత్తనాలలోని వైవిధ్యత కారణంగా చేలో అక్కడక్కడ ప్రత్యేక మొక్కలు మొలుస్తాయి. అలాంటివాటిని గుర్తించి,వాటి ప్రత్యేకతని(ex:లావు గింజ లేదా మంచి రుచి లేదా నీరు అందకపోయిన బాగా పండడం)బట్టి వాటిని ఎంచుకుని, కోసేటప్పుడు ధాన్యాన్ని విడిగా పక్కకు
తీసుకుని చిన్న స్థలం లో నాటి పెంచి అవి పండాక
వాటిలోకొన్ని మంచివి ఎంచుకొని మళ్ళీ వేరేగా పెంచి వచ్చిన ధాన్యాన్ని విత్తనాలుగా వాడుకోవచ్చు.
ఇది చాలా మంచి,సహజసిద్దమైన పద్దతి.
హైబ్రిడ్ పద్దతిలో జన్యుపరంగా తయారు చేసినప్పుడు,పరీక్షలో ఫెయిల్ అయిన విత్తనాల్ని రంగులు పూసి అమ్ముతున్నారు ప్రైవేట్ సంస్థలు.కాబట్టి ఈ పద్దతి వాడి సరికొత్త ఒరవడి సృష్టించండి